స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ‘గుర్తింపు’.. సెబీ కొత్త నిబంధన
1 min readపల్లెవెలుగు వెబ్ : స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి సెబీ ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది. ‘గుర్తింపు పొందిన ఇన్వెస్టర్ల` విధానాన్ని సెబీ తీసుకొచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్ చేసే వారిని ‘ అక్రిడేటెడ్ ఇన్వెస్టర్లు’ గా సెబీ గుర్తించనుంది. సెబీ నిబంధనల ప్రకారం వ్యక్తులు, హిందూ యునైటెడ్ ఫ్యామిలీ, కుటుంబ ట్రస్ట్ లు, సింగిల్ మేనేజ్ మెంట్లు, కార్పొరేట్ సంస్థలు, పార్ట్నర్ షిప్ సంస్థలు, ట్రస్టులకు ఈ అక్రిడేట్ ఇన్వెస్టర్ల గుర్తింపు లభిస్తుంది. డిపాజిటరీ అనుబంధ సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజీలు ఈ గుర్తింపు పత్రాలను జారీ చేస్తాయి.
అర్హత :
- వ్యక్తి, హెచ్ యూఎఫ్, ఫ్యామిలీ ట్రస్ట్, సింగిల్ మేనేజ్ మెంట్లకు.. సంవత్సరానికి నికర ఆదాయం 2 కోట్లు.. లేదా.. 7.50 కోట్ల నికర విలువ కలిగి ఉండాలి. ఇందులో సగం ఆస్తుల రూపంలో ఉండాలి.
- సంస్థలకు కోటి సంవత్సరాదాయం, 5 కోట్ల నికర విలువ ఉండాలి.
- ట్రస్టులకు కనీసం 50 కోట్ల నికర విలువ ఉండాలి.
- కార్పొరేట్లకు 50 కోట్ల నికర విలువ ఉండలి.