ఇడ్లీ, దోశ పొడులపై 18 శాతం జీఎస్టీ
1 min readపల్లెవెలుగు వెబ్: ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ లో ఉపయోగించే బ్రాండెడ్ రెడీ టు కుక్ పొడులపై జీఎస్టీకి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. బ్రాండెడ్ రెడీ టు కుక్ పొడులపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తమిళనాడు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. వీటి తయారీకి ఉపయోగించే పిండి పై 5 శాతం జీఎస్టీ ఉంది. పొడులకు మాత్రం 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇడ్లి, దోశ తయారీకి ఉపయోగించే రాగి, జొన్న, సజ్జ పొడులతో పాటు .. వీటన్నిటినీ కలిపి చేసిన 49 రకాల పొడులు ఏ జీఎస్టీ శ్లాబులోకి వస్తాయో చెప్పాలని కృష్ణ భవన్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ సంస్థ ఏఏఆర్ ను కోరింది. వీటిని పరిశీలించిన ఏఏఆర్ ఇవి 18 శాతం జీఎస్టీ శ్లాబులోకి వస్తాయని స్పష్టం చేసింది.