PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడివాడలో మన్యం వీరుడి విగ్రహావిష్కరణ

1 min read
మన్యంవీరుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి కొడాలి నాని

మన్యంవీరుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి కొడాలి నాని

పల్లెవెలుగు వెబ్​, గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం కొత్త మున్సిపల్ కార్యాలయం సెంటర్లో క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శుక్రవారం ఆవిష్కరించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుడి 97వ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అల్లూరిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆశయసాధనలో ఎంతో మంది మహనీయులు ప్రాణాలర్పించారని, అటువంటి వారిలో అల్లూరి ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. గుడివాడ పట్టణంలో తొలిగా అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పేందుకు క్షత్రియ సేవాసమితి, అల్లూరి స్మారక కమిటీ సభ్యులు చేస్తున్న కృషికి తనవంతు సహకారాన్ని అందజేశానన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, అల్లూరి సీతారామరాజు స్మారక కమిటీ ఫౌండర్ సాగిరాజు ఉదయభాస్కరరాజు, గుడివాడ క్షత్రియ సేవాసమితి అధ్యక్షుడు కనుమూరి భాస్కరరాజు, కార్యదర్శి కోసూరి కామరాజు (రవిరాజు), గౌరవ సలహాదారు ఎండీవీఎస్ పున్నం రాజు, ముఖ్య సలహాదారు ముదునూరి సూర్యనారాయణరాజు (సూరిబాబు), ఉపాధ్యక్షులు దళపతిరావు దామోదరరావు, క్షత్రియ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యుడు రుద్రరాజు విజయ్ కుమార్ రాజు, నాయకులు కనుమూరి శివాజీరాజు, చిలువూరి నాగరాజు, గుడివాడ ఆర్డీవో జీ శ్రీసుకుమార్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యుడు పెద్ద ప్రసాద్, ప్రముఖులు నండూరి ఉమాశంకర్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి , సయ్యద్ గఫార్, జనసేన నేత ఆర్‌కే తదితరులు పాల్గొన్నారు.

About Author