పవన్ కు ఏదైనా జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదు !
1 min readపల్లెవెలుగువెబ్ : పవన్ కల్యాణ్ ను అనుసరిస్తూ పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా కదలాడుతున్నారంటూ వచ్చిన వార్తలపై బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్బంగా వీర్రాజు ప్రస్తావించారు. పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.