PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేషన్ కార్డు అడిగితే- ఘర్షణకు దిగిన వాలంటీర్

1 min read

పల్లెవెలుగు వెబ్  అన్నమయ్య జిల్లా రామాపురం: గడపగడపకు ఉన్న ప్రభుత్వం కార్యక్రమం నందు తమకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఒక మహిళ అడుగగా ఆయన ఈమెకు ఎందుకు రేషన్ కార్డు మంజూరు చేయలేదని వాలంటీర్ను నిలదీసి వెంటనే రేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పడంతో ఆ వాలంటీ తమ వారిని తీసుకొని సదరు మహిళ ఇంటి పైకి దాడికి దిగడం జరిగిందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సంఘటన అన్నమయ్య జిల్లా, రామాపురం మండలం రాచు పల్లె గ్రామపంచాయతీ లోని పొలిమేరపల్లి లో చోటుచేసుకుంది, వివరాల్లోకి వెళితే పొలిమేర పల్లి గ్రామంలో కాపురం ఉంటున్న టేకూరి రమణమ్మ కు రేషన్ కార్డు లేకపోవడంతో, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వచ్చిన శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి కి ఆ మహిళ విన్నవించుకోవడం జరిగింది, అయితే ఎమ్మెల్యే ఆమెకు ఎందుకు రేషన్ కార్డు మంజూరు కాలేదు అంటూ అక్కడ ఉన్న వాలంటీర్ విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు, రమణమ్మ కొద్ది రోజులు కువైట్ కి వెళ్ళినందున ఆమెకు రేషన్ కార్డు మంజూరు చేయలేదని వాలంటీ ఎమ్మెల్యేకు తెలియజేశారు, అయితే ఆ మహిళ నేను కువైట్ కి వెళ్లిన మాట వాస్తవమని, నేను తిరిగి వచ్చి సుమారు ఐదు సంవత్సరాలు కావొస్తుందని ఇంతటి వరకు నాకు రేషన్ కార్డు మంజూరు కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడం జరిగింది, సమస్యను విన్న ఎమ్మెల్యే వెంటనే ఆమెకు రేషన్ కార్డు ఇవ్వాలని అక్కడున్న అధికారులను, వాలంటీర్ కు సూచించడం జరిగింది, అయితే ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత, వాలంటీర్ విజయ్ కుమార్ తన బలగాన్ని వేసుకుని ఆ మహిళ పై గొడవకు దిగారు, నీ దిక్కున్న చోట చెప్పుకో నీకు రేషన్ కార్డు ఇచ్చే ప్రసక్తే లేదని, నోటికి వచ్చిన విధంగా ఆ మహిళపై బండ బూతులు తిట్టడం జరిగింది, ఈ విషయాన్ని గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి దృష్టి కి తీసుకపోవడంతో, ఆయన వెంటనే పొలిమేర పల్లెకు వెళ్లి బాదిత మహిళా టేకురి రమణమ్మ ను పరామర్శించి రేషన్ కార్డు వచ్చే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్దాం అని హామీ ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ వ్యవస్థను కొందరు స్వార్ధపరులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది పేద ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అక్కడి గ్రామస్తులు చర్చించుకోవడం జరుగు తున్నది, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని బాధితులకు అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

About Author