PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తమిళంలో ప్రశ్నిస్తే.. అదే భాషలో సమాధానం ఇవ్వాలని రూల్ ఉందా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎంపీల ప్రశ్నలకు కేంద్ర మంత్రులు హిందీలో సమాధానం ఇవ్వడంపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాల నినాదాలతో లోక్‌సభ మార్మోగింది. దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహంపై డీఎంకే సభ్యుడు ఎ.గణేశమూర్తి బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్న అడిగినప్పుడు ఈ వివాదం మొదలైంది. తమిళంలో చెప్పిన మొదటి భాగం మిస్సయ్యానని, ఏ ప్రాజెక్టు గురించో తెలియజేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ కోరగా, ‘నేను ఆంగ్లంలో ప్రశ్న వేస్తే.. మంత్రులు ఆంగ్లంలోనే స్పందించాలి. తమిళంలో ప్రశ్నిస్తే, మంత్రులు హిందీలో సమాధానం ఇస్తున్నారు’ అంటూ గణేశమూర్తి ఆక్షేపించారు. దీనిపై స్పందించిన గోయెల్‌.. అనువాదం అందుబాటులో ఉన్నందున హిందీలో జవాబిచ్చానన్నారు. దీంతో ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకూ సమాధానాలు హిందీలో చెబుతున్నారంటూ ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. ప్రశ్న మరోసారి వినిపించాలని స్పీకర్‌ ఓం బిర్లా సూచించడంతో గణేశమూర్తి తమిళంలోనే ప్రశ్నను పునరుద్ఘాటించారు. దీంతో అసహనానికి గురైన పీయూష్‌ గోయెల్‌ ‘ఓ భాషలో అడిగిన ప్రశ్నకు అదే భాషలో సమాధానం ఇవ్వాలనే నిబంధన ఏదైనా ఉందా?’ అని స్పీకర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

     

About Author