అసదుద్దీన్ ఓవైసీని అరెస్టు చేస్తే.. రూ. 22 లక్షలు !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూ నాయకుడు కులభూషణ్ భరద్వాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని అరెస్టు చేస్తే.. ఆ పోలీసు అధికారికి రూ. 22 లక్షలు ఇస్తానంటూ ప్రకటించారు. హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంస్థల సభ్యులు గురుగ్రామ్ వీధుల్లో ఆందోళన జరిపారు. డిప్యూటీ కమీషనర్ నివాసం ఎదురుగా ఉన్న ట్యాంక్ పార్క్ వద్ద హిందూ కార్యకర్తలు గుమిగూడి కాళీచరణ్‌ను విడుదల చేయాలని, ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.