బిపిన్ రావత్ ను కించపరిస్తే.. వెంటాడి పట్టుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్: తమిళనాడులోని కున్నూరు వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ను కించపరిస్తే సహించేదిలేదని కర్ణాటక హోం మంత్రి అగర జ్ఞానేంద్ర హెచ్చరించారు. సోషల్ మీడియాలో రావత్ పై కించపరిచే పోస్టింగులు పెట్టేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డీజీపీని ఆదేశించారు. దేశం గర్వించే బిపిన్ రావత్ త్యాగాల్ని అవహేళన చేసేవారిని కఠినంగా శిక్షించాలని డీజీపీని హోంమంత్రి ఆదేశించారు. సోషల్ మీడియా ద్వార వారి అడ్రస్ లు గుర్తించి.. వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు.