NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే సహకరిస్తాం: సీపీఐ నారాయణ

1 min read


పల్లెవెలుగు వెబ్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అంతగా కోపం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని.. అందుకు తాము కూడా సహకరిస్తామన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు. అయితే పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. పాదయాత్రలో సంఘ విద్రోహ శక్తులు లేవని.. ఒకవేళా ఎవరైనా ఉంటే అది వైసీపీ వారే ఉంటారని తనదైన స్టైల్‌లో వివరించారు. కేంద్రమంత్రి అమిత్ షా తిరుపతికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. తిరుపతికి వచ్చి ప్రధాని మోదీ ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చి ఆమలు చేయలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.35 నుంచి రూ. 40 పెంచి.. రూ. 5 తగ్గిస్తారా అంటూ మండిపడ్డారు. ఆదాని పోర్టు నుంచి మత్తుమందు యథేచ్చగా రవాణా అవుతోందని నారాయణ ఆరోపించారు.

About Author