అధికారంలోకి వస్తే.. రైతులకు రూ. 3 లక్షల రుణమాఫీ !
1 min readపల్లెవెలుగువెబ్ : గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం ప్రకటించారు. వ్యవసాయ ఆధారిత, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్రంలో పర్యటించారు. బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అహ్మదాబాద్లో పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు.