NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎదురిస్తే.. చంపేయ‌డం రాజ‌కీయ‌మా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లాలో టీడీపీ నేత తోట చంద్ర‌య్య హ‌త్య పై చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తోట చంద్ర‌య్య హ‌త్య‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమాధానం చెప్పాల‌ని చంద్రబాబు డిమాండ్ చేశారు. గుండ్ల‌పాడులోని చంద్ర‌య్య కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు.. అనంత‌రం చంద్ర‌య్య అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌జాస్వామ్యం కోసం పోరాడిన వ్య‌క్తి చంద్ర‌య్య అని తెలిపారు. చంద్ర‌య్య ఆత్మ‌కు శాంతి క‌లిగేలా భ‌విష్య‌త్తులో వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఎదురుతిరిగిన వారిని చంపేయ‌డ‌మే రాజ‌కీయమా ? అని ప్రశ్నించారు. ` పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ఖ‌బ‌డ్దార్. నీలాంటి వాళ్ల‌ను చాలా మందిని చూశా. ప‌ల్నాడులో ముఠాల‌ను అణ‌చివేసింది నేనే. రౌడీలంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలి అంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

                                             

About Author