కరోన సోకితే.. పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన మహమ్మారి సోకితే పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఏంటన్న సమాచారంతో కుటుంబ,ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక జాబితా రూపొందించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం పిల్లల్లో తక్కువ లక్షణాలు బయటపడుతున్నాయని, తక్కువ కేసుల్లోనే కరోన లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. చాలా మంది కరోన సోకిన పిల్లలకు ఇంటి వద్దే నయం అవుతోందని, లక్షణాలు తీవ్రంగా ఉన్నవారే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తెలిపింది.
లక్షణాలు: జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన కోల్పోవడం,
కండరాల నొప్పి, ముక్కు నుంచి విపరీతంగా నీరు కారడం, జీర్ణాశయ సమస్యలు.
వీటితో పాటు వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు ఉంటే ఖచ్చితంగా కరోన టెస్ట్ చేయించాలి.