కర్ఫ్యూ రూల్స్ ఉల్లంఘిస్తే.. కొరఢానే..
1 min read– విపత్తు చట్టం కింద 48 కేసులు..
– మాస్క్ ధరించని 563 మందిపై రూ. 80,975 జరిమాన
– కడప ఎస్పీ అన్బురాజన్
పల్లెవెలుగు వెబ్, కడప: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో .. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరఢా ఝుళిపిస్తోంది కడప పోలీసు శాఖ. కర్ఫ్యూ సమయంలో దుకాణాలు తెరిచినా, భౌతిక దూరం పాటించకపోయినా, మాస్క్ ధరించకపోయిన వారిపై విపత్తు చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం విపత్తు నిర్వహణ చట్టం, 188 ఐ.పి.సి క్రింద నమోదు చేసిన కేసుల్లో జిల్లా లో 48 కేసులు నమోదు చేసినట్లు ఎస్.పి తెలిపారు. మాస్క్ ధరించని వారిపై 563 కేసులు నమోదు చేసి రూ.80,975 జరిమానా విధించడం జరిగిందన్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతిఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని… పదే పదే చెప్పినా.. వినని వారిపై ఉపేక్షించమన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, మందులు, తదితర దుకాణాలకు వెళ్లిన సందర్భాలలోనూ నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.