అభివృద్ధి జరగాలంటే.. టీడీపీకే ఓటు వేయండి
1 min read
కోట్ల, టీజీ భరత్‌ను సన్మానిస్తున్న అభిమానులు, కార్యకర్తలు
– కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్
పల్లెవెలుగు, కర్నూలు
నగరంలో నెలకొన్న సమస్యలపై అధికార పార్టీ అభ్యర్థులను ప్రశ్నించి.. నిలదీయాలని టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని 42, 44, 43, 52, 51, 49 వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. టిడిపి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఓట్లు అడిగారు. కర్నూల్లోని వార్డుల్లో సమస్యలు చాలా ఉన్నాయని తమ దృష్టికి వస్తోందన్నారు. అందుకే టిడిపి అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలు ఉన్నాయని తెలిసిన వెంటనే అక్కడకు వెళ్లి పరిష్కరిస్తారన్నారు. ఈ మేరకు తాము హామీ ఇస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నట్లు భరత్ తెలిపారు. పదవులన్నీ అధికార పార్టీకి ఇస్తే పనులు చేయరన్నారు. ప్రశ్నించే వారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలంతా తరలివచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు అభ్యర్థి తిరుపాల్ బాబు, 44వ వార్డు అభ్యర్థి మనోజ్ కుమార్, 43వ వార్డు అభ్యర్థి సువార్తమ్మ, 52వ వార్డు విజయ ప్రత్యూష, 51వ వార్డు మౌనిక రెడ్డి, 49వ వార్డు విక్రమ్ సింగ్‌ను గెలిపించాలని కోరారు.