అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేస్తా: టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: తనకు అవకాశం ఇస్తే కర్నూలును అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని 12వ వార్డు బాపూజీ నగర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో చేసిన తప్పు మరోసారి చేయొద్దని ప్రజలను కోరుతున్నామన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు మారిపోయేదన్నారు. ప్రతి వార్డులో టిడిపి సభ్యత్వాలు భారీగా నమోదు చేయించాలని నేతలకు చెప్పారు. పార్టీ సభ్యత్వాల నమోదుతోనే విజయం ప్రారంభమవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు ఈశ్వర్, తారనాథ్, చిన్నమ్మి, పెంచులయ్య, తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.