ఎమ్మెల్యే అయితే సమస్యలు పరిష్కరిస్తా : టి.జి భరత్
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు సమస్యలు లేకుండా పాలన సాగిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని నాల్గవ వార్డులో ఆయన వార్డు పర్యటన చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు టిజి భరత్ కు సమస్యలు మొరపెట్టుకున్నారు. డ్రైనేజీ సమస్య, పెన్షన్లు, విద్యుత్ స్తంబాలకు కరెంట్ షాక్ తగులుతోందని చెప్పారు. ఈ సందర్భంగా వారితో టిజి భరత్ మాట్లాడుతూ నగరంలోని చాలా వార్డుల్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రజలను పాలించే నాయకుడు కరెక్టుగా లేకపోతే సమస్యలే మిగులుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. వార్డు పర్యటన చేపట్టిన టిజి భరత్ కు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మహిళలు, వ్రుద్దులు, యువత ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి ఊట్ల రమేష్, టిడిపి నేతలు పాల్గొన్నారు.
