ఆయన మాటిస్తే.. దానికి రివర్స్ చేస్తాడంతే !
1 min readపల్లెవెలుగువెబ్ : జగన్ మాట ఇచ్చాడంటే, దానికి రివర్స్ చేస్తాడంతే అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ నేత నారాలోకేష్. మాట తప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్, మడమ తిప్పుడుకి ఐకాన్ జగన్ అని అన్నారు. కరెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు తీసిన దీర్ఘాలు స్థాయిలోనే మూడేళ్లలో కరెంటు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ కొట్టించారని విమర్శించారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చి, ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేశారని చెప్పారు. 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.40 పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు 55 పైసలు పెంచడం ఏ రేంజ్ బాదుడో జగన్‌రెడ్డే చెప్పాలి.
అని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.