NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయ‌న గెలిస్తే.. నీ ప‌రిస్థితి ఏంటి జ‌గ‌న్ ?

1 min read
పల్లెవెలుగు వెబ్​ : ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై తెలంగాణ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి స్పందించారు. చంద్ర‌బాబు నాయుడుకి జ‌రిగిన అవ‌మానాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. గ‌తంలో వైఎస్ చంద్ర‌బాబును ఒక మాట అని.. త‌ర్వాత రికార్డుల నుంచి తొల‌గించార‌ని అన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఇలాంటి దూష‌ణ‌లు చూడ‌లేద‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డం త‌న‌కు ఇబ్బందిగా అనిపించింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో నైతిక విలువ‌లు మ‌రిచిపోయి దూష‌ణ‌ల‌కు దిగ‌డం స‌రికాద‌న్నారు. ప‌ద‌వులు ఎవ‌రికీ శాశ్వతం కాద‌ని, రాజ‌కీయాల్లో విలువ‌ల‌ను ప‌రిర‌క్షించుకోవాల‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గెలిస్తే.. నీ ప‌రిస్థితి ఏంటి జ‌గ‌న్ ? అంటూ జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు.

About Author