NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా ప‌ద‌వి పోతుంటే.. వాళ్లు పండుగ చేసుకుంటున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా నెఫ్టాలి బెనెట్ అధికారంలోకి వ‌చ్చారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బెంజిమ‌న్ నెతన్యాహు ప‌ద‌విని కోల్పోయారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చ‌ట్ట స‌భ‌ల్లో చివ‌రి ప్రసంగం చేశారు. తాను అధికారం కోల్పోతుంటే.. ఇరాన్ పండుగ చేసుకుంటోంద‌ని అన్నారు. ఇజ్రాయిల్ లో బ‌ల‌హీన ప్రభుత్వం ఏర్పడుతున్నందుకు ఇరాన్ సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ఇజ్రాయిల్ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు పొందిన నెత‌న్యాహును గ‌ద్దె దించ‌డానికి ప్రతిప‌క్షాల‌న్నీ ఏక‌మయ్యాయి. నెత‌న్యాహు ప‌దివి నుంచి దిగిపోవ‌డంతో.. ఆయ‌న ప్రత్యర్థులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పార్లమెంటులో నెత‌న్యాహు మెజార్టీ సాధించ‌లేక‌పోయారు. త్వర‌లో తాము అధికారంలోకి వ‌స్తామంటూ నెత‌న్యాహు ప్రతిప‌క్షాల‌ను హెచ్చరించారు.

About Author