PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేను హామీ ఇచ్చానంటే సిద్దార్థ హామీ ఇచ్చినట్లే…

1 min read

ముచ్చుమర్రికి మాజీమంత్రి  బైరెడ్డి శేషశయనా రెడ్డి పేరు పెట్టాలి.

నియోజకవర్గానికి రెండు కళ్ళు మద్దూరు సుబ్బారెడ్డి, బైరెడ్డి శేషశయానారెడ్డి లు.

బ్రాహ్మణ కొట్కూరులో  స్వేచ్చ వాతావరణం నెలకొంది నా హయాంలోనే.

నాయకుల ఆధిపత్యం కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టారు.

:గ్రామంలో 400 మంది పేదలకు ఇంటి స్థలాలను ఇచ్చాను.

136 ఎకరాల ప్రభుత్వ భూమి పేదలకు పంపిణీ చేశాను.

నా హయాంలో బ్రాహ్మణ కొట్కూరు లో రూ.22 కోట్లతో అభివృద్ధి చేశాం.

:రాజకీయ సంస్కరణలు చేయాలంటే దమ్ము ధైర్యం కావాలి.

సంస్కరణలు చేసే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.

మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి సంచలన వ్యాఖ్యల

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నేను హామీ ఇచ్చాను అంటే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హామీ ఇచ్చినట్లేనని వైకాపా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్టుకూరులో వ్యవసాయ పరపతి సహకార సంఘం సొసైటీ చైర్మన్ గా మద్దూరు సతీష్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా మద్దూరు సతీష్ రెడ్డి ఇంటి దగ్గర నుండి కేజీ రోడ్డు మీదుగా బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వై కాపా నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తండ్రి డాక్టర్ బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వా శివరామకృష్ణారెడ్డి ,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకార మహోత్సవంలో సభలో మద్దూరు సతీష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పిటిసిలు ప్రసంగించారు . అనంతరం ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మాట్లాడుతూ నియోజకవర్గానికి మద్దూరు సుబ్బారెడ్డి , బైరెడ్డి శేషారెడ్డిలు రెండు కళ్ళలాంటి వారని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బ్రాహ్మణ కొట్కూరులో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వివక్షకు గురై ఆధిపత్యం కోసం నాయకుల వ్యక్తిగత స్వార్థం కోసం స్వేచ్ఛ వాతావరణం లేకుండా చేశారని వివరించారు.అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకంలో వారికి సంబంధించిన వ్యక్తుల పేర్లు మస్టర్లు వేసుకొని అక్రమంగా సంపాదించుకున్నారన్నారు. నాడు వైయస్సార్ హయాంలో తన భార్య ఎమ్మెల్యే గా ఉంటూ జైలు నుంచి తన భర్తను బయటికి తెచ్చుకొని అక్రమ సంపాదన కోసం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసి పబ్బం గడుపుకునే వారని పరోక్షంగా గౌరు దంతుల పై ఘాటుగా విమర్శలు గుప్పించారు . నాడు వైయస్సార్ పుణ్యమా అంటూ నన్ను ఎమ్మెల్యేగా చేశారని నాతోపాటు ఆమెను కూడా ఎమ్మెల్యేగా చేసిన ఘనత డాక్టర్ వైయస్సార్ కే దక్కింది అన్నారు. వైయస్సార్ లేకపోతే ఆ కుటుంబానికి ఉనికే లేదన్నారు. నేను పనిచేసిన ఐదేళ్లలో గ్రామంలో వారి ఆధిపత్యం కోసం నేను అభివృద్ధి చేయకూడదని అడ్డుపడేవారని వారిని లెక్కచేయకుండా నాడు 400 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు స్థలాలు ఇచ్చామని, దాదాపు 136 ఎకరాలు ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేశామన్నారు. అంతే కాకుండా బ్రాహ్మణ కొట్కూరు గ్రామ అభివృద్ధి కొరకు రూ. 22 కోట్లు నిధులు తెప్పించి గ్రామంలో సిసి రహదారులు, రోడ్లు వేయించి గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు . నాడు ఆధిపత్యం కోసం తకులాడుతున్న వ్యక్తులపై ఎదురు తిరిగి అభివృద్ధి చేసి వ్యవస్థను గ్రామంలో మార్చి వేశామని నాడు అలా ధైర్యంగా ముందుకు వెళ్లి పనులు చేసినందుకే నేడు గ్రామంలో ప్రజలంతా ధైర్యంగా వైయస్సార్ జెండాను రెపరెపలాడిస్తున్నారన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం పునర్విభజన జరిగిన తరువాత మద్దూరు సుబ్బారెడ్డి శేషశయానారెడ్డిలు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో రాష్ట్రంలో నందికొట్కూరును పరిపాలన  విధానంలో ఎలా విలువలు తెచ్చారో మళ్ళీ  ఆ విధంగా పరిపాలన కొనసాగించే విధానానికి అర్హుడు యువ నాయకుడు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారని నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగనన్న ఆ రిజర్వేషన్లను సంస్కరణలు చేసి అమలు చేస్తూ ముస్లిం మైనార్టీలకు కూడా పదవులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నకే దక్కుతుందన్నారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి దళితులకు, ముస్లీమ్ మైనార్టీ లకు అండగా ఉంటూ 64ఏళ్ళ చరిత్ర ను తిరగరాశాడని అందుకు చిన్న ఉదాహరణ బి సి మైనార్టీ మహిళ రాహత్ జబ్బర్ కు నందికొట్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి, అంతేకాకుండా 80 బన్నూరు వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ గా ఒక దళితుడు, వైకాపా నేత వైవి రమణకు చైర్మన్ పదవి ఇప్పించడమేనన్నారు. సంస్కరణ లు  చేయడమే కాకుండా దానిని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఒక విజనున్న నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వారి ఆశయ సాధనకు సరైన నాయకత్వం కలిగిన వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు , కార్యకర్తలు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అభిమానులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

About Author