ప్రశ్నించి నిలదీస్తేనే.. ప్రజాస్వామ్యానికి మనుగడ..!
1 min readటీడీపీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు, విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు హనుమంత రావు చౌదరి
కర్నూలు: ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో “నేను ఉన్నాను.. నేను చూస్తున్నాను.. అధికారం లోకి వస్తే మీకు.. పూల పాన్పు వేస్తా.. స్వర్గం చూపిస్తా ’ అంటూ.. శుష్క వాగ్దానాలు చేసిన వైఎస్ జగన్.. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటినా.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి గుర్తు లేనట్లు ప్రవర్తించడం దారుణమని టీడీపీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు, విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు హనుమంత రావు చౌదరి విమర్శించారు. గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని.. 2016 నాటి చట్టాలు అమలు చేయాలని అడుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలో వికలాంగుల సంక్షేమ సంఘం పోరాట సమితి (వి.యస్.పి.యన్) ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికై గౌరిగోపాల్ హస్పిటల్ ఎదురుగా VSPS రాష్ట్ర కార్యదర్శి లక్ష్మన్ స్వామి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి హాజరై తన మద్దతు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా హనుమంత రావు చౌదరి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా సమాజంలోని అన్నివర్గాల వారికి అన్యాయం చేస్తోందన్నారు. అధికారం ఉందని విర్రవీగిన నియంతలకు… బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పాలకులను ఎక్కడి కక్కడ ప్రశ్నించి నిలదీస్తే నే హక్కులు దక్కుతాయని అన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వము స్పందించి తొలగించిన రేషన్ కార్డులను, పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విభిన్న ప్రతిభావంతులు న్యాయంగా అడుగుతున్న సంక్షేమ పథకాలను, చట్టాలను, తక్షణమే అమలు చేయకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని హనుమంత రావు చౌదరి హెచ్చరించారు.