నేను తలచుకుంటే…కమీషనర్ నీ ఉద్యోగం పీకేపిస్తా..!
1 min read– వేలం పాటలో మున్సిపల్ కమిషనర్ కు హెచ్చరికలు.
– వేలం పాటలో మున్సిపల్ అధికారులపై మైనారిటీ నాయకుడు హల్ చల్..
– మళ్ళీ వేలం పాట వాయిదా వేసిన అధికారులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : వేలం పాటలో వీడియో తీస్తున్న ప్రైవేట్ వ్యక్తిని బయటకు పొమ్మనందుకు నా మనిషిని బయటకు పంపిస్తావ బయటకు పంపితే నీ ఉద్యోగం ఊడగొడతానని మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ ను సలాం ఖాన్ హెచ్చరించారు. పట్టణంలోని జైకిసాన్ పార్కులో బుధవారం మాంసపు దుకాణాలు, కబేళా, బస్టాండ్,దినసరి మార్కెట్, వారపు సంత లకు మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ అధ్యక్షతన వేలం పాటలను నిర్వహిస్తున్నారు. ఈ వేలం పాటలో పాల్గొనేందుకు 17 మంది రూ.5 లక్షలు, ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు రూ.1 లక్ష చొప్పున డిపాజిట్ చేసి టోకెన్ తీసుకున్నారు. మధ్యాహ్నం 3 : 45 గంటలకు వేలం పాటలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదట వారపు సంత వేలం పాటను రెవెన్యూ అధికారిణి విజయ లక్ష్మి ఆధ్వర్యంలో ఆర్ ఐ రంగన్న సవాలు పాడుతుండగా పట్టణానికి చెందిన యువకుడు అధికారుల అనుమతులు లేకుండా నిలబడి వీడియో చిత్రీకరిస్తుండగా వీడియో తీయొద్దని కమిషనర్ యువకుడిని మందలించి వదిలేశారు. అయినప్పటికీ అధికారుల హెచ్చరికలు పెడచెవిన పెట్టి అక్కడే కుర్చీలో ఆశీనుడై రహస్యంగా వీడియో చిత్రీకరిస్తుండగా మున్సిపల్ సిబ్బంది గమనించి అతను మళ్ళీ రహస్యంగా వీడియో తీస్తున్నారని కమిషనర్ కు తెలిపారు. కమిషనర్ ఆ యువకుణ్ణి బయటకు వెళ్ళిపొమ్మని అన్నారు పక్కనే ఉన్న మైనార్టీ నాయకులు సలాం ఖాన్ జోక్యం చేసుకుని ఎందుకు వీడియో తీయకూడదు చెప్పండి అని కమిషనర్ ను ప్రశ్నించారు. మీరు పాట దారులు కాదు ముందు మీరు బయటికి వెళ్ళండని కమిషనర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా యువకుని ,నన్ను బయటకు పంపితే నేను తలుచుకుంటే నీ కమిషనర్ ఉద్యోగమే తీసేపిస్తా అంటూ ఆగ్రహిస్తూ దుర్భాషలకు దిగారు. దీంతో వేలం పాటలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వేలం పాటలను ఎవరు పాడొద్దంటూ సలాం ఖాన్ అందరిని బయటకు తీసుకు వెళ్లారు. దీంతో వేలం పాటలను కమిషనర్ వాయిదా వేశారు.మళ్ళీ శుక్రవారం యధావిధిగా వేలం పాటను నిర్వహిస్తామని తెలిపారు. అనధికారికంగా వేలం పాటలోకి ప్రవేశించి వేలం పాటను అడ్డుకున్న వ్యక్తి పై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తామని విలేకరులకు తెలిపారు.
ఈ సంఘటన పట్ల స్థానిక పోలీసు స్టేషన్ ముందు ముస్లింలు ఆందోళనకు సిద్ధమైనట్లు సమాచారం.