ఇలాగే కొనసాగితే.. ఇక ఊరుకోం !
1 min readపల్లెవెలుగువెబ్ : హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు నిరసనలు సాగిస్తుండటంపై హోం మంత్రి జ్ఞానేంద్ర మాట్లాడుతూ, ఇంతకాలం తాము ఓపికతో వ్యవహరించామని, ఇంకెంతమాత్రం ఊరుకునేది లేదని అన్నారు. విద్యార్థుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి మనోభావాలు దెబ్బతినకూడదని తాము ఇంతవరకూ ఓర్పుతో ఉన్నామని అన్నారు. బయట వ్యక్తులు రెచ్చగొడుతుండటంతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారని అన్నారు. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ కోర్టు ఉత్తర్వులకు కట్టుబడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు.