NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌క‌పోతే.. త‌మిళ‌నాడు వెళ్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కు మందు పంపిణీకి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపారు. లేని ప‌క్ష‌లో త‌మిళనాడు ప్ర‌భుత్వంతో మాట్లాడుతాన‌ని చెప్పారు. అక్క‌డి ప్ర‌భుత్వం స‌హ‌కరిస్తే ఆయుర్వేద మందు పంపిణీ చేస్తాన‌ని అన్నారు. రెండో విడత కొవిడ్‌ సమయంలో లక్షా యాభై వేల మంది క‌రోన పాజిటివ్‌ల రోగుల‌కు తన మందు అందించడం జరిగిందన్నారు. తాను తయారు చేసి పంపిణీ చేసే మందు ఇమ్యూనిటీని పెంచేది మాత్రమేనని చెప్పారు. ఆయుష్‌ సంస్థ తన మందు పంపిణీ నిలుపుదల చేయమని నోటీసులు జారీ చేసినందున న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, ఈ నెల 20న తీర్పు వస్తుందన్నారు.

                                        

About Author