NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ సీఎం కాకుంటే.. రాజ‌కీయ స‌న్యాసం చేస్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ సీఎం కాకుంటే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని ఉప ముఖ్య‌మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న పేట‌లో ఇంటి ప‌త్రాల పంపిణీలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కోసం ప్రాణాలిచ్చే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, సచివాల‌య వ్య‌వ‌స్థ ఉంద‌ని అన్నారు. టీడీపీ చేసింది త‌క్కువ‌, ఆర్భాటాలు ఎక్కువ‌ని అన్నారు. చంద్ర‌బాబు అమ‌రావ‌తిని ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ గా తీర్చిదిద్దుతామ‌ని అన‌డం హాస్యాస్ప‌దం అన్నారు. రాజధాని క‌న్నా రాష్ట్రంలో స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ‌ని అన్నారు.

                                            

About Author