అధికంగా బెల్లం అమ్మితే..కఠిన చర్యలు తప్పవు…
1 min read
సారాను రూపుమాపేందుకు మీ సహకారం అవసరం
ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: గుర్తుతెలియని వ్యక్తులకు 10 కేజీలకు మించి బెల్లం అమ్మకూడదని అలా బెల్లం అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వి రాముడు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మంగళవారం సాయంత్రం అల్వాల కళ్యాణ మండపంలోజిల్లా అధికారులు ఆదేశాల మేరకు నందికొట్కూరు కిరాణా మర్చంట్ అసోసియేషన్, నిత్యావసరాలు హోల్ సెల్ డీలర్స్ సభ్యులతో అసోసియేషన్ ప్రెసిడెంట్ మన్సూర్ అహమ్మద్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా తయారీకి ప్రధాన వనరు బెల్లం కావున బెల్లము అమ్మకంలో నియంత్రణ పాటించాలని బెల్లం వ్యాపారులకు సూచించారు.నందికొట్కూరు మండలంలో కోళ్ల బావాపురం నీలి షికారి కాలనీ నాటుసారా తయారీ కేంద్రాలుగా ఉన్నాయి.ఇక్కడ ఉండేటువంటి ప్రజలు నాటుసారా తయారీ అనేది వ్యాపకంగా కలిగి ఉండి విచ్చలవిడిగా నాటు సారాయి తయారుచేసి చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేయడం చుట్టుపక్క గ్రామాలకు వెళ్లి నాటు సారా అమ్మడం వ్యాపకంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వారిలో మార్పు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.O అనే కార్యక్రమం చేపట్టింది. నందికొట్కూరులో ఉన్నటువంటి బెల్లం వ్యాపారస్తులకు నాటుసారా తయారీకి ప్రధాన వనరు అయినటువంటి బెల్లం మీద అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు.నాటుసారా తయారీ దారులకు బెల్లము సరఫరా చేయడంలో సహకరించాలని అన్నారు.గుర్తు తెలియని వ్యక్తులకు,నాటుసారా తయారు చేసే వ్యక్తులకు బెల్లము అమ్మకాలు చేయరాదు.హైకోర్టు ఆదేశాల మేరకు 10 కేజీలకు మించి ఒక వ్యక్తికి బెల్లం అమ్మకూడదు. 100 కేజీలకు మించి బెల్లం నిల్వ చేయరాదనివ్యాపారస్తులు సారాను రూపుమాపేందుకు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు,ఎస్సైలు జఫురుల్లా,భాష్యం శ్రీనివాసులు,అసోషియేషన్ అధ్యక్షులు వజీర్ బాష,నాగేష్ ప్రసాద్,సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.