PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేవైసీ వివ‌రాలిస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేవైసీ అప్ డేట్ పేరుతో జ‌రిగే మోసాల ప‌ట్ల జాగ్రత్తగా ఉండాల‌ని, ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవ‌హ‌రించినా ఇబ్బందులు త‌ప్పవ‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజ‌ల్ని హెచ్చరించింది. మీ బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ అప్ డేట్ చేయాలి.. మీ పాన్ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్, బ్యాంక్ అకౌంట్ నెంబ‌ర్, కార్డు పిన్ నెంబ‌ర్ వంటి వివ‌రాలు అడుగుతార‌ని, అలాంటి వారి ప‌ట్ల జాగ్రత్తగా ఉండాల‌ని సూచించింది. గుర్తు తెలియ‌ని వ్యక్తులు, సంస్థల నుంచి ఇలాంటి ఫోన్స్, మెసేజ్ లు వ‌స్తున్నాయని, వీరి మాట‌లు న‌మ్మి మీ వివ‌రాలు ఇస్తే బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నార‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కేవైసీ అప్ డేష‌న్ పెండింగ్ ఉన్న అకౌంట్ల లావాదేవీల‌పై ఎలాంటి ఆంక్షలు విధించ‌వ‌ద్దని, ఈ అప్ డేష‌న్ కోసం ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు గ‌డువు ఇవ్వాల‌ని బ్యాంకుల‌ను ఆర్బీఐ ఆదేశించింది.

About Author