PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్పు కోసం భూమిని తాకట్టు పెడితే…

1 min read

– అప్పు ఇచ్చిన వ్యక్తి భూమిని కా చేసిన వైనం
– అప్పు డబ్బులు తిరిగి ఇచ్చిన.. భూమి ఇవ్వని అప్పు ఇచ్చిన వ్యక్తి
– భూమి నడిగినందుకు, తన అనుచరులతో బెదిరింపులు
– న్యాయం కోసం తిరిగి వేసారి.. ఆత్మహత్య చేసుకున్న యువ దంపతులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తన అవసరం నిమిత్తం తన భూమిని తనకా పెట్టి ఒక వ్యక్తికి వద్ద 3, లక్షల రూపాయలు అప్పుచేసి, తిరిగి ఆ అప్పును ఇచ్చి తన భూమిని తనకు ఇవ్వాల్సిందిగా కోరితే.. తన భూమి తనకు ఇవ్వక పొగ అతనిని.. పోలీస్ స్టేషన్లకు తిప్పి వేధించి వేసారించి తనను భయభ్రాంతులకు గురి చేయడంతో.. తనకు న్యాయం జరగదని భావించి గర్భిణీ అయిన తన భార్యతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలమైన చెన్నూరులో చోటు చేసుకుంది… ఇందుకు సంబంధించి మృతుని తల్లి వరలక్ష్మి వివరాల మేరకు.. వరలక్ష్మికి, రమణారెడ్డి దంపతులకు కుమారుడు, కుమార్తె, కాగా తన భర్త రమణారెడ్డి మరణంతో, ఆమె పుట్టిల్లు అయిన రామనపల్లెకు వెళ్లి అక్కడే జీవించేది అయితే తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన భూమిని మృతుడు సాయి కుమార్ రెడ్డి, కడప నగరం పాలెంపల్లికి చెందిన నారాయణ స్వామికి మూడు లక్షల రూపాయలకు ఆయ కానికి పెట్టడం జరిగిందని అని తెలిపారు, ఆయకానికి పెట్టే ముందు తన డబ్బు వడ్డీతో సహా ఎప్పుడైనా చెల్లించండి, మీ భూమి మీకు తిరిగి ఇస్తానని నారాయణస్వామి చెప్పడం జరిగిందని ఆమె తెలిపారు, కాగా ఇటీవల డబ్బు తీసుకొని తన భూమి తనకు ఇవ్వాలని నా కుమారుడు సాయి కుమార్ రెడ్డి నారాయణస్వామిని అడుగగా అతను ఇవ్వకపోగా నా బిడ్డను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగిందన్నారు, దీనికి సంబంధించి పంచాయితీలు కూడా జరిగాయని తెలిపారు, అయితే నారాయణస్వామి తన అనుచరుల చేత నా బిడ్డను అనేకమార్లు, కడప టౌన్ లో బెదిరించి, రుబాబ్ చేసి బండ బూతులు తిట్టడం వల్ల, తన భూమి అక్రమంగా తీసుకోవడమే కాకుండా తనను మానసికంగా వేధించడంతో తను మనస్థాపం చెంది తనతో తన భార్యతో కూడా చెప్పుకోవడం జరిగిందన్నారు, ఇక తమకు న్యాయం జరగదని తెలిసి ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని ఆమె అన్నారు.ప్రేమ వివాహం చేసుకుని……… తన కుమారుడు సాయి కుమార్ రెడ్డి, హేమమాలినితో కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడం జరిగిందని, వారు ఎంతో అన్యోన్యంగా ఉన్నారని సాయికుమార్ రెడ్డి తల్లి వరలక్ష్మి తెలిపారు, తన కుమారుడు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని, వారు వివాహం చేసుకున్న తర్వాత కడప నగరం దుర్గమ్మ కాలనీలో సంసారం ఉంటున్నారని, సాయి కుమార్ రెడ్డి ఈ కామ్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ గా పని చేస్తున్నాడని, అలాగే హేమమాలిని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుందని తెలిపారు, కాగా తన కోడలు హేమమాలిని ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అని ఆమె తెలిపారు,ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న తమ కుటుంబంలో నారాయణ స్వామి మా భూమి తీసుకోవడమే కాకుండా, మమ్మల్ని మానసికంగా వేధింపులకు గురిచేసి తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడం జరిగిందని ఆమె ఆరోపించారు.గ్రామంలో విషాదఛాయలు….. ముక్కు పచ్చలారని యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త మండల వ్యాప్తంగా వ్యాపించడంతో.. అటు రామనపల్లి, ఇటు చెన్నూరు భవాని నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.. యువ దంపతుల మృతదేహాలను కడసారిగా చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు.. మృతదేహాలను చూడగానే బంధువులు ,స్నేహితులు, గ్రామస్తులు బోరున విలుపించారు.. నిండు గర్భిణీ అయినా హేమమాలిని చూసి గ్రామస్తులు చలించి పోయారు.. ఎలా నీకు దేవుడు ఈ ధైర్యం ఇచ్చాడు తల్లి.. ఎందుకిలా చేశావు తల్లి అంటూ వారు విలపించారు. అన్నీ తానై… రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి…… రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి అన్ని తానై కనుమలో పల్లె నుండి, కడప మార్చురీ, చెన్నూరు వరకు యువ దంపతుల మృహదేహాల అంత్యక్రియల ముగిసేంతవరకు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూడడంతో పాటు, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆ కుటుంబానికి అండదండగా నిలబడడం జరిగింది.అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు… యువ దంపతుల అంత్యక్రియలు చెన్నూరు పెన్నా నది తీరాన బంధుమిత్రులు, ఆత్మీయులు గ్రామస్తుల మధ్య నిర్వహించారు.. ఈ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలిరావడం విశేషం.

About Author