ఇలాగే వదిలేస్తే.. క్రిప్టోతో తప్పదు ముప్పు !
1 min readపల్లెవెలుగువెబ్ : క‌్రిప్టో కరెన్సీతో ప్రమాదం తప్పదని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. వీటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పు పరిణమిస్తోందని వ్యాఖ్యానించింది. క్రిప్టో లావాదేవీలు డాలర్లలో జరుగుతాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కొంత భాగాన్ని డాలరీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్య చెలామణిని దెబ్బతీయడం ద్వార ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాలకు కూడ ముప్పుగా మారుతుందని అభిప్రాయపడింది. ఆర్థిక శాఖ మాజీ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యుల ముందు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ విషయాలను స్పష్టం చేశారు.