NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం వ‌స్తే ఆ రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని పాట్నాలో ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణమేమీలేదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్ కుమార్ ఇటీవలే యత్నాలు ముమ్మరం చేశారు. నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి,రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్ఎల్‌డీ నేత చౌతాలా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోనూ చర్చలు జరిపారు. అతి త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఆయన సమావేశం కానున్నారు.

                                             

About Author