ఆయనే లేకుంటే.. పెట్రోల్ రూ. 200 దాటేది !
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్ణాటక మంత్రి మురుగేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ లేదంటే పెట్రోలు లీటరుకు రూ. 200 దాటేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్ నిరాణి పేర్కొన్నారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా బసవరాజ్ బొమ్మై ఉండడంతోనే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ సాధ్యమైందన్నారు. ప్రధానిగా మోదీ కాకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలు రూ.200 పైగా దాటేదన్నారు.