ఎన్టీఆర్ పేరు మారిస్తే… జగన్ చరిత్ర హీనుడే:టీడీపీ
1 min read– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా
పల్లెవెలుగువెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని, అటువంటి వ్యక్తిని అవమాన పరచడం అంటే తెలుగు జాతిని అవమాన పరచడమేనన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాష. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న పేరును తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టేదానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గాజుల ఖాదర్బాషా మాట్లాడుతూ 1988వ సంవత్సరంలో హెల్త్ యూనివర్సిటీ ని ఎన్టీఆర్ స్థాపించారని 1998వ సంవత్సరంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పెట్టి గౌరవించారన్నారు. అలాంటి తెలుగు ప్రతీక ఎన్టీఆర్ ను జగన్ రెడ్డి అవమానపరిచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్న పేరును తొలగించడం ఎంతటి దుర్మార్గమని తీవ్రంగా దుయ్యబట్టారు. హెల్త్ యూనివర్సిటీ నిధులు 400 కోట్ల రూపాయలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్ళించారని ఆరోపించారు. వైయస్సార్ పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టారు, అలాగే కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ పేర్లు మార్పు చేయలేదన్నారు.ఈ కార్యక్రమంలో గాలివీడు క్లస్టర్ ఇంచార్జ్ సత్య రెడ్డి రాజంపేట టీఎన్ఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి సాయికుమార్ రాజంపేట పార్లమెంటరీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రెడ్డయ్య రాయచోటి తెలుగు యువత పట్టణ అధ్యక్షులు ఇనాం రాయచోటి పట్టణ మైనార్టీల అధ్యక్షులు అతవుళ్ళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గన్ మెన్ రాజు సిద్దయ్య తెలుగు యువత నాయకులు భాస్కర్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.