NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ రెండు ఉంటేనే గోవాలో.. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: డ‌బ్బు, పైర‌వీలు చేసే వారికే గోవాలో ప్రభుత్వ ఉద్యోగాలు దొర‌కుతున్నాయ‌ని ఆరోపించారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. గోవాలో నిరుద్యోగం గ‌రిష్ఠ స్థాయికి చేరుకుంద‌ని చెప్పారు. ఈ అంశం పై చ‌ర్చించేందుకు గోవా వెళ్తున్నాన‌ని సోమవారం అర‌వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వ‌చ్చే ఏడాది గోవాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆప్ వినూత్న ప్ర‌చారం కార్యక్రమం చేప‌ట్టింది. ఉద్యోగాలు ఇవ్వని పార్టీకి ఓటు వేయొద్దని కోరుతోంది. మ‌రోవైపు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్లో పోటీకి ఆప్ స‌మాయ‌త్తం అవుతోంది. ఉత్తర‌ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచ‌ల్ ప్రదేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో పోటీ చేయ‌నుంది. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక స‌మ‌స్యలే ఎజెండాగా ఆప్ దూసుకుపోతోంది.

About Author