NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా అత్తకి బాయ్ ఫ్రెండ్ గా ఉంటే.. 72 వేలు ఇస్తా’ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మ‌న దేశంలో పెళ్లి కొడుకు కావాల‌నో.. పెళ్లి కూతురు కావాల‌నో క్లాసిఫైడ్స్ లో ప్రక‌ట‌న‌లు ఇస్తాం. కానీ అమెరికాలో ఓ కోడ‌లు త‌న అత్తకు బాయ్ ఫ్రెండ్ కోసం ప్రక‌ట‌న ఇచ్చింది. అలా వ‌చ్చే వారికి 960 డాల‌ర్లు ఇస్తాన‌ని చెప్పింది. కానీ కొన్ని ష‌ర‌తులు పెట్టింది. న్యూయార్క్ లోని త‌న అత్తతో పాటు ఓ ఫంక్షన్ కు హాజ‌ర‌య్యేందుకు బాయ్ ఫ్రెండ్ కావాల‌ని ప్రక‌ట‌న‌లో పేర్కొంది. వ‌య‌సు 40 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాల‌ని.. క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ తో పాటు డాన్స్ బాగా వ‌చ్చి ఉండాల‌ని ష‌ర‌తు విధించింది. అలా వ‌చ్చిన వారికి 960 డాల‌ర్లు అంటే మ‌న డ‌బ్బుల్లో 72వేలు చెల్లిస్తామ‌ని చెప్పింది. ఈ ప్రక‌ట‌న ప్రస్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

About Author