శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే.. కఠిన చర్యలు
1 min read– డీఎస్పీ వినోద్ కుమార్
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల : మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. కఠిన చర్యలు తప్పవని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం గోనెగండ్ల పోలీస్ స్టేషన్ను డీఎస్పీతోపాటు ఎమ్మిగనూరు సీఐ బీఏ మంజునాథ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ కోడుమూరు పరిధిలో ఉన్న గోనెగండ్ల పీఎస్.. ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యం కోసం ఎమ్మిగనూర్ రూరల్ సర్కిల్, ఆదోని సబ్ డివిజన్ పరిధిలోకి మార్చారని ప్రజలు గమనించాలన్నారు.
కర్ఫ్యూ ఆంక్షలు.. పాటించాల్సిందే..
కరోన నియంత్రణలో భాగంగా ప్రతిఒక్కరూ కర్ఫ్యూ ఆంక్షలు పాటించాలని డీఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. గోనెగండ్ల పీఎస్ తనిఖీ అనంతరం ఆయన కర్ఫ్యూ తీరును పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రోడ్లపై తిరిగే వారిపై జాతీయ విపత్తు కింద కేసులు నమోదు చేస్తామన్నారు . కార్యక్రమంలో సిఐ మంజునాథ్, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.