NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్దిరెడ్డి జోలికొస్తే చంద్రబాబు కారుపై బాంబులేస్తా !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రెస్కో చైర్మన్ సెంథిల్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి జోలికి వ‌స్తే చంద్రబాబు కారుపై బాంబులేస్తా అంటూ రెచ్చిపోయారు. కుప్పంలో వైకాపా నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు నాయుడు పై తిట్ల దండ‌కం మొద‌లుపెట్టారు. పక్కనున్న నేత‌లు వారిస్తున్నా ఆయ‌న త‌న స్టైల్లో తిట్ల వ‌ర్షం కురిపించారు. సెంథిల్ వ్యాఖ్యల‌కు నిర‌స‌న‌గా టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్ కు బ‌య‌లుదేరాయి. దీంతో వైకాపా నేత‌లు వారిని అడ్డుకునే ప్రయ‌త్నం చేశారు. ఇరువ‌ర్గాల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు. రెస్కో చైర్మన్ సెంథిల్ వ్యాఖ్యల‌తో కుప్పంలో ఉద్రిక్తత నెల‌కొంది.

About Author