జనం చస్తుంటే.. గుర్రపు స్వారీలా? : నారా లోకేష్
1 min readపల్లెవెలుగు వెబ్ : బెడ్లు దొరక్క బయట, బెడ్లు దొరికి.. ఆక్సిజన్ లేక ఆసుపత్రుల్లో ప్రజలు చనిపోతున్నారని, ఇవేమీ పట్టని వైకాపా ప్రజాప్రతినిధులు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. కరోనా బారిన పడి వందల మంది చనిపోతుంటే వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం సరదాల్లో మునిగి తేలడం దారుణమని అన్నారు. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి రుయా కి 60 కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వానికి, వైకాపా నాయకులకి ప్రజల ప్రాణాలు అంటే ఎంత లెక్కలేనితనమో గుర్రం మీద ఉరేగుతున్న నేతలు ఒక ఉదాహరణ అని నారా లోకేష్ అన్నారు.