నాణ్యత లోపం తేలితే చర్యలు తప్పవు
1 min read
ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టు తర్వాత నాణ్యత తెలుస్తుంది
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
రాష్ట్ర ఆర్ డబ్లూఎస్ ఛీఫ్ ఇంజనీర్ హరేరామ నాయక్
మంత్రాలయం , న్యూస నేడు: నాబార్డు నిధులు రూ 25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నాణ్యత లోపం అని తేలితే చర్యలు తీసుకుంటామని, కూలి పోవడానికి కారణాలని వస్తున్న ఆరోపణలు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ తర్వాతే తెలుస్తుందని రాష్ట్ర ఆర్ డబ్లూఎస్ ఛీప్ ఇంజనీర్ హరేరామ నాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీలో కూలిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను క్వాలిటీ కంట్రోల్ బోర్డు డిఈ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. మండల పరిధిలోని సూగురు గ్రామ సమీపంలో 2017 లో నాబార్డు ద్వారా మంజూరైన 9 కోట్ల రూపాయల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తో మరో మూడు ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణం హైదరాబాద్ కు చెందిన జిపిఆర్ కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో చేపట్టినట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం కూలిన ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి విచారణకు ఆదేశించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వచ్చి ట్యాంక్ కు పిల్లర్లను నాణ్యతను, మట్టిని కూడా తీయించి చూశారు. పిల్లర్లను సుత్తితో కొట్టి శబ్దాన్ని పరీక్షించారు. ఒక చోట ఒక శబ్దం, మరో చోట మరో రకమైన శబ్దం రావడాన్ని గమనించారు. పిల్లర్లను ఎంత లోతుగా తవ్వి కట్టారనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ట్యాంక్ నిర్మాణానికి వాడిన ఇనుప చువ్వలు సిమెంటు, మట్టి నమూనాలను సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తామని, మిగిలిన రెండు ఓవర్ హెడ్ ట్యాంక్ లను కూడా పరిశీలిస్తామని తెలిపారు. మొత్తం మళ్లీ ఒక సారి క్షుణ్ణంగా అన్నింటినీ పరీక్షలు చేసి గ్రామానికి నీటి సరఫరా చేస్తామని తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కాంట్రాక్టర్ పై చర్యలు ఉంటాయని తెలిపారు. కాంట్రాక్టర్ కు కూడా ఇంకా 2 కోట్ల రూపాయలు వరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఉందని ఈ నిర్మాణాల పై హైకోర్టు లో కేసు కూడా ఉందని పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా నీటిని సరఫరాకు టెస్టింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. నాణ్యత లోపం అని తేలితే కాంట్రాక్టర్ పై చర్యలు ఉంటాయని తెలిపారు. ఆయన వెంట ఇఇ పద్మజ నాటి డిఈ సాంబయ్య ప్రస్తుత డిఈ మోహినుద్దీన్, నాటి ఏఈ నాగమల్లయ్య ప్రస్తుత ఏఈ వెంకట్రాముడు జల జీవన్ మిషన్ కాంట్రాక్టర్ రమణారెడ్డి క్వాలిటీ కంట్రోల్ బోర్డు డిఈ కుషయ్ కుమార్ తో పాటు ఇతర సిబ్బంది గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఇంచార్జీ కార్యదర్శి ఇస్రత్ భాష ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శివప్రసాద్ కవిత ఆర్ డబ్లూఎస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
