NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాహుల్ పాద‌యాత్ర‌లో పాల్గొంటా : ర‌ఘువీరారెడ్డి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: క్రియాశీల రాజ‌కీయాల‌కు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి నీలకంఠాపురం ర‌ఘువీరారెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం తాను రాజ‌కీయ సెలవులో ఉన్నాన‌ని ఆయ‌న అన్నారు. మూడేళ్ల క్రితం రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, ఇప్ప‌టికీ అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రాజ‌కీయ సెల‌వులో ఉన్న‌ప్ప‌టికీ తాను రాహుల్ గాంధీ యాత్ర‌కు హాజ‌ర‌వుతాన‌ని ర‌ఘువీరా చెప్పారు. ఇటీవ‌లే జ‌రిగిన వైఎస్సార్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల్లో క‌నిపించిన ర‌ఘ‌వీరా… రాహుల్ యాత్ర‌లోనూ పాలుపంచుకుంటాన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

                                      

About Author