అలా ఉంటే.. నెలకు రూ. 25 లక్షలు ఇస్తానన్నాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని గోదావరి
సినిమాలో హీరో మరదలిగా నటించిన నీతూ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. నీతూ తన జీవితంలో జరిగిన ఓ భయంకరమైన విషయం గురించి మాట్లాడుతూ.. ‘ఓ బడా వ్యాపారవేత్త నన్ను అతనికి జీతం తీసుకునే భార్యగా ఉండమన్నాడు. అందుకోసం అతను నాకు నెలకు రూ.25 లక్షలు ఆఫర్ చేశాడు’ అని తెలిపింది. ఆ సమయంలో హృదయం బాధతో బరువెక్కిందని చెప్పింది. అలాగే మరొక ఘటన గురించి నీతూ మాట్లాడుతూ.. ‘బాగా పేరున్న కాస్టింగ్ డైరక్టర్ ఉన్నాడు. ఇక్కడ అతని పేరు చెప్పట్లేదు. అతను నన్ను దాదాపు గంటపాటు ఆడిషన్ చేశాడు. అనంతరం నన్ను రిజెక్టు చేశాడు. అది నాలో నమ్మకాన్ని చంపేసింది. నిజానికి అతను నన్ను రిజెక్టు చేయడానికి ఆడిషన్ చేశాడని తర్వాత తెలిసింది“ అని చెప్పుకొచ్చింది.