ఇలాగైతే మనం దివాళా తీస్తాం : స్పేస్ ఎక్స్ అధినేత
1 min readపల్లెవెలుగు వెబ్: స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఉద్యోగులను హెచ్చరించాడు. ప్రయోగాలు ఇలాగే నత్తనడకన సాగితే కంపెనీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ పంపాడు. “ఇటీవల కాలంలో స్టార్‌షిప్ లాంచ్ వెహికల్‌కు ఉపయోగించే రాప్టార్ ఇంజిన్ తయారీలో చాలా వెనకబడి పోయాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్పేస్‌ఎక్స్ సంస్థకు దివాళా తీసే పరిస్థితి తలెత్తుతుంది” అంటూ మెయిల్ లో ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఎలన్ మస్క్ మార్స్‌పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భూమి మీద ఏదైనా ప్రమాదం జరిగి, భూమి మీద మనుగడ అంతరించి పోతే మానవుడు మార్స్ మీద జీవించడానికి తన తన సంపద ఉపయోగ పడాలని ఎలన్ మస్క్ కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యంతోనే ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకు సాగుతుంది. తాను ఊహించినట్లు భవిష్యత్‌లో మార్స్, చంద్రమండలంపై మానువుని మనుగడ కోసం రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్‌తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నారు.