PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లక్షణాలు ఉంటే… హోం ఐసోలేషన్​..!

1 min read

లక్షణాలు ఉంటే… హోం ఐసోలేషన్​..!
– కోవిడ్​ ఫలితాలు వచ్చేంతవరకు ఎదురు చూడొద్దు..
– పాజిటివ్​ వస్తే… కిట్లను అందజేయండి
– ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్​ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కోవిడ్​ లక్షణాలు ఉన్న వారిని వెంటనే హోం ఐసోలేషన్​లో ఉంచాలని, ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడొద్దని ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్ రెడ్డి అన్నారు. పరీక్ష చేసిన వ్యక్తికి సంబంధించి పాజిటివ్​ వస్తే… కోవిడ్​ కిట్లను అందజేయాలని స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో మరియు ప్రత్యేక అధికారులతో ఇన్​చార్జ్​ కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోవిడ్ 19 పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెస్టింగ్​ సామర్థ్యం పెంచాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నమూన శాంపిళ్ళ సేకరణ రెండు షిఫ్ట్ లలో నిర్వహించి ఆ శాంపిళ్ళను కర్నూలు మెడికల్ కాలేజీ ల్యాబ్ కు పంపాలని సూచించినారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ మరియు ఐసోలేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి మరణాల సంఖ్య తగ్గింపునకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫీవర్ సర్వేలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారందరికీ టెస్టులు నిర్వహించాలని, టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిని ట్రైయోజింగ్ చేసి హోం ఐసోలేషన్ లేదా కోవిడ్ కేంద్రాలకు, ఆసుపత్రికి ఎక్కడో ఒక చోటకు పంపాలన్నారు.

About Author