PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ, జ‌న‌సేన క‌లిస్తే.. వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘‘రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేేస్త వార్‌ వన్‌ సైడ్‌ అవుతుంది. నేను జూన్‌, జూలై మొదటి వారం వరకు శాస్ర్తీయంగా నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీ 93 స్థానాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేలింది. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న స్థానాలలో సగం స్థానాల్లో విజయం సాధించినా ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం 7 నుంచి 8 కాగా, మరో మూడు నుంచి నాలుగు స్థానాలలో విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న 65 స్థానాలలో మా పార్టీ ఒకవేళ 90 శాతం స్థానాలలో విజయం సాధించినా 73 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేేస్త నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న స్థానాలలో ఆ రెండు పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.

                                      

About Author