వారంలోగా ఉపాధ్యాయు ల జీతాలు చెల్లించకపోతే డైరెక్టరేట్ ముట్టడిస్తాం..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి 60 వేల మంది ఉపాధ్యాయుల జీతాలు వారం రోజుల లోపల చెల్లించకపోతే పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న హెచ్చరించారు. రాష్ట్ర సంఘ పిలుపుమేరకు ఈరోజు తేదీ 04-08-2023 రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు ఎదుట జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు జిల్లా అధ్యక్షులు ఎస్ గోకారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ తిమ్మన్న జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవ ప్రసన్నరాజు, సీనియర్ నాయకులు సి రమేష్ మామర్ షఫీ జి బసవరాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.
1) వేసవి సెలవులలో పదోన్నతులు బదిలీలు పొందినటువంటి దాదాపు 60 వేల మంది ఉపాధ్యాయులకు జూన్ మరియు జూలై నెల జీతాలు పెండింగ్ ఉన్నాయని వీటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
2). పెండింగ్ ఉన్నటువంటి జీతాలు వారం రోజుల లోపల చెల్లించకపోతే ఆగస్టు నెల మూడో వారంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని అమరావతిలో ముట్టడిస్తామని తెలియజేశారు.
3). ప్రమోషన్ పొందినటువంటి ఏడువేల మంది స్కూల్ అసిస్టెంట్లు, 900మంది హైస్కూల్ ప్రధానోపాధ్యా యులు, 679 మంది మండల విద్యాధికారులు, రెండువేల మంది ప్లస్ టు స్కూల్ అసిస్టెంట్లు, 53,000 మంది బదిలీ పొందిన ఉపాధ్యాయులు వీరందరూ కూడా రెండు నెలలుగా జీతాలు లేక బ్యాంకులకు హోం లోన్స్ పర్సనల్ లోన్స్ నెలసరి వాయిదాలు చెల్లించలేక బ్యాంకులో పెనాల్టీ విధిస్తున్న విషయాన్ని వివరిస్తూ దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి ప్రశ్నించారు. ఈ విధంగా ఉపాధ్యాయులు బ్యాంకులకు నెలసరి వాయిదాలు చెల్లించలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం తేవడం అత్యంత బాధాకరమని ఉపాధ్యాయులను ఆర్థికంగా మానసికంగా శోభకు గురి చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలియజేశారు.
5). జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తో ప్రాథమిక పాఠశాలలు దాదాపు తొమ్మిది వేలు మూతపడే స్థాయికి వచ్చాయని ప్రభుత్వ లెక్కల ప్రకారమే నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలివేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేరారని విమర్శించారు.
6). ప్రాథమిక పాఠశాల నిర్వీర్యం అయితే పునాది లాంటి ప్రాథమిక విద్య వ్యవస్థ పైన ఆధారపడినటువంటి ఉన్నత పాఠశాల విద్య కూడా త్వరలోనే బలహీనపడుతుందని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని దీనిని సమాజంలో ఉండే మేధావులు యువకులు ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు.
6).తక్షణమే జీవనంబర్ 117 ను ఉపసంహరించాలని ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతిల వరకు ప్రాథమిక విద్య ఉండే విధంగా సవరించాలని డిమాండ్ చేశారు.
7). అదేవిధంగా కొత్తగా పదోన్నతి ఇచ్చినటువంటి 679 మంది మండల విద్యాధికారుల అధికారాలు విధులు జీతభత్యాల విషయమై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని తక్షణమే ఇద్దరు మండల విద్యాధికారుల మధ్య సరి సమానంగా అధికారాలు విధులు విభజన చేయాలని డిమాండ్ చేశారు.
8) రాష్ట్రవ్యాప్తంగా బదిలీల అనంతరం అక్రమ బదిలీల పేరుతో లక్షల కులది డబ్బులు వసూలు చేసి రాజకీయ నాయకులు మంత్రుల అనుచరులకు ధనవంతులైన ఉపాధ్యాయులకు దొడ్డిదారి బదిలీలు చేస్తా ఉన్నారని తక్షణమే వీటన్నిటిని రద్దుచేసి కౌన్సిలింగ్ విధానాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్టియు నాయకులు జిల్లా ఉపాద్యాయుని కన్వీనర్ దేవదాసు జి నాగరాజు వెంకట్ రాముడు శివనాగిరెడ్డి నారాయణ శ్రీధర్ గోవిందు వెంకట్రాముడు శ్రీనివాసులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్త ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.