పది లక్షల ఉద్యోగాలిస్తే… నా ప్రచారం ఆపేస్తా !
1 min readపల్లెవెలుగువెబ్ : బిహార్‌లో తాజాగా ఏర్పడిన మహాఘటబంధన్ కూటమి సర్కారు వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 5లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగాలను కల్పించగలిగితే తన జన్ సూరజ్ అభియాన్ ప్రచారాన్ని విరమించుకుంటానని మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం ప్రకటించారు. అంతేకాక, నితీశ్‌కు పూర్తి మద్దతునిస్తానని తేల్చిచెప్పారు. ఈ మేరకు బిహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘నితీశ్ కుమార్ ఫెవికాల్ రాసుకుని మరి ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కుపోయారు. ఇతర పార్టీలన్నీ ఆయన చుట్టూ అలా తిరుగుతూ ఉండాల్సిందే. నేను రాజకీయాల్లోకి వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది. ఈలోపే రాష్ట్ర రాజకీయాలు 180డిగ్రీల మేర మారిపోయాయి. మున్ముందు బిహార్ రాజకీయ ముఖచిత్రం మరిన్ని మార్పులకు లోనవుతుంది’’ అని ప్రశాంత్ పేర్కొన్నారు.