ఆ కాంట్రాక్టర్ ఆలయానికి వస్తే… సెల్యూట్ తప్పనిసరి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానంలో ఒక కాంట్రాక్టర్ ఆలయంలోనికి వస్తే… స్థానిక సిబ్బంది సెల్యూట్ చేయడంతో పాటు ప్రత్యేక ద్వారాలు తెరవాల్సి వస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఆయన ఓ కాంటాక్ట్ అయిన స్థానిక పాలకమండలిలో ఒక కీలక వ్యక్తి కి సన్నిహితుడు కావడంతో ఆడింది ఆట పాడింది పాటగా మారినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆ కాంట్రాక్టర్ వస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అనుకోకుండా అప్రమత్తంగా లేకపోవడంతో పాటు కొన్నిసార్లు విధుల్లో కొత్త వ్యక్తులు ఉండి గుర్తించకపోయిన ఆగ్రహంతో ఊగిపోతూ తన సెల్ ఫోను బయటకు తీసి మీపై చర్యలు తీసుకోవాలని అధికారులకు లేదా మండలి సభ్యుల్లోని కీలక వ్యక్తికి చెబుతానని బెదిరించినట్లు అవరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన వెంటనే ఆలయంలో పనిచేసే సిబ్బంది మరియు అర్చకులు ఆ కాంట్రాక్టర్ వ్యవహార శైలిపై ఆందోళన చెందుతూ దాసోహం అంటూ పూజ తదితర ఇతర కార్యక్రమాలు అధికారికంగా కాకుండా అనధికారికంగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం కూడా ఆలయంలో ప్రత్యేక పూజ కోసం ఆ కాంట్రాక్టర్ కొంతమందితో వచ్చి పట్టుపట్టగా భరించలేక అక్కడ ఉన్న సిబ్బంది మరియు అర్చకులు ధైర్యం చేసి మీ ఇష్టం ఉన్నచోట చెప్పుకోండని తెగేసి చెప్పినట్లు సమాచారం ఇప్పటికే సదర్ కాంట్రాక్టర్ పై పలు ఆరోపణలు వచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తెలుస్తుంది. కారణం పాలకమండలిలో సభ్యులు ఒకరు వెనుక వెన్నముక్కల నిలిచి ఉండడంతో అధికారులు కానీ స్థానికంగా ఉండే సిబ్బంది కానీ ఆ కాంట్రాక్టర్ వైపు కన్నెత్తి చూడడం లేదని సొంత వాహనాలకు కూడా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.