ఆ దేశాన్ని అలా వదిలేస్తే ప్రపంచానికే ప్రమాదం !
1 min read
Newly-appointed Pakistani Foreign Minister Shah Mahmood Qureshi addresses the media on his first day at the Foreign Ministry in Islamabad on August 20, 2018. (Photo by FAROOQ NAEEM / AFP)
పల్లెవెలుగు వెబ్ : తాలిబన్లు ఆక్రమించుకున్న ఆప్ఘనిస్థాన్ ను అలాగే ఒంటరిగా వదిలేస్తే అక్కడి ప్రజలతో పాటు.. ప్రపంచానికే ప్రమాదం ఉంటుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ హెచ్చరించారు. అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం ఆప్ఘనిస్థాన్ పట్ల సానుకూల వైఖరి అవలంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆప్ఘనిస్థాన్ విషయంలో నూతన సానుకూల వైఖరిని అవలంభించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరారు. ఆప్గన్ లో నెలకొన్న మానవ సంక్షోభాన్ని నివారించడం పై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. నిధుల సమీకరణలో భాగంగా జెనీవాలో జరగనున్న సమావేశం పట్ల పాక్ విదేశాంగ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.