ఆ పని చేస్తే కానీ జీవీఎల్ కు నిద్రపట్టలేదా ?
1 min readపల్లెవెలుగువెబ్ : విభజన చట్టంలోని సమస్యలపై న్యాయం చేయాలని అనేకసార్లు ప్రధానిని కలిసి సీఎం జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చారు. అప్పుడు చంద్రబాబు, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గోతికాడ నక్కల్లా చంద్రబాబు, బీజేపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. చంద్రబాబు సలహా మేరకే జీవీఎల్ పట్టుబట్టి అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారు. ప్రత్యేక హోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందనేదే జీవీఎల్ ఆలోచన అని అన్నారు. రాష్ట్రానికి మేలు జరగకుండా ఉండేందుకు జీవీఎల్ మంచి పాత్రే పోషిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో జీవీఎల్ బాగా పనిచేస్తున్నారు. అజెండాలోంచి తీసేసిన తర్వాత దెయ్యాల్లా వేదాలు వల్లిస్తున్నారు.