బట్టలు ఆరవేస్తే.. రూ. 20 వేల జరిమానా
1 min readపల్లెవెలుగువెబ్ : యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాలిటీ అధికారులు వింత నిర్ణయం తీసుకున్నారు. బాల్కనీలో బట్టలు ఆరవేయడానికి వీల్లేదని, ఒకవేళ అలా చేస్తే రూ.20వేలు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. అలా బాల్కనీలో బట్టలు ఆరవేయడం వల్ల సిటీ అందం దెబ్బతింటుందనేది మున్సిపల్ అధికారుల మాట. అందుకే లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరవేసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే మాత్రం రూ.20వేలు కట్టాల్సిందేనని అన్నారు. నేర తీవ్రతను బట్టి ఈ జరిమానా మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.