పిల్లలు 7గంటలకు వెళ్తుంటే.. 9 గంటలకు రాలేమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ‘మన పిల్లలు ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు వెళ్తుంటే అప్పుడు మనం 9 గంటలకే కోర్టుకు రాలేమా?’’అని సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పేర్కొన్నారు. జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఉదయం 9.30 గంటలకే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రొసీడింగ్స్ 9.30 గంటలకే ప్రారంభం కావడాన్ని సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గి ప్రశంసించగా జస్టిస్ లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.